ప్రాణం కన్నా ఆశయం గొప్పది || మైత్రేయాస్ ఆశయాలు ఏమిటి?? || bloggingmaitreyas

ప్రాణం కన్నా ఆశయం గొప్పది

మనందరి జీవితం లో ఏదో ఒక ఆశయం ఉండే తీరుతుంది.ఒకరికి బాగా చదవాలని ఉంటే మరొకరికి బాగా బ్రతకాలని. మరి కొందరికి మన్ననలను పొందాలని మరి కొందరికి మర్మాన్ని తెలుసుకోవాలని.కొందరికి వ్యక్తి గతమైనవి అయితే మరి కొందరివి సామాజిక పరమైనవి అందరికీ వైద్యం, విద్య అందేలా చేయాలనుకోవడం లాంటివి అయితే మరీ కొందరికి సత్యపరమైనవి అందరికీ సత్యం అనుభవం లోకి రావాలి అని దానికి కృషి చేయడం. మైత్రెయాస్ యొక్క ఆశయం సత్యపరమైనది.
మైత్రేయాస్ కి ఉన్న ఆశయం ఏమిటి?
1)సరి అయిన ధ్యానం:- అనగా నిర్విషయ యోగం.
సరి అయిన ఆధ్యాత్మికతను సరిగ్గా ఆచరించడం ఆచరించే బోధనలను చేయడం. ఆధ్యాత్మికథ పేరుతో శారీరకంగా, మానసికంగా, వ్యక్తిగతంగా, ఆర్థికంగా,ఆధ్యాత్మికంగా ఏ స్త్రీని కానీ పురుషుడిని కానీ వాడరాదు. అలా జరగాలంటే అందరికీ ధ్యానం యొక్క రుచి అర్థం కావాలి,ఆధ్యాత్మికత లోని సూక్షత్మలు సులభంగా స్పష్టంగా అనుభవం లోకి రావాలి కనుక దానికి తగిన విధంగా బోధనలు చేయడం.
2) సరి అయిన జ్ఞానం: 
అ) పూర్విక ఋషీ సంప్రదాయ విలువలతో కూడిన విద్య
అంటే పూర్వకాలం లాగా గురుకుల విద్య అందించే గురుకులాన్ని స్థాపించడం.కేవలం బట్టి కొట్టి పరీక్షకు రాసి పట్టా పొందేక మర్చిపోయే చదువులను కాక మనో ఫలకం లో చిరస్థాయిగా నిలిచిపోయేలా విద్యను అందించడం.విద్యాభ్యాసం పూర్తయ్యేసరికి అన్నీ కళలు, శాస్త్రాల తో బాటు ఆత్మ జ్ఞానిగా చక్కటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండేలా విద్యను అందించడం.
 ఆ) ఆత్మ జ్ఞానం అందించే రీసెర్చ్ అండ్ టీచింగ్ సెంటర్స్ ని నెలకొల్పడం.
3) సరి అయిన సేవ: ఆధ్యాత్మిక మరియు సాంఘిక సేవా కార్య్రమాల్లో భాగం అవ్వడం.దేశ రాష్ట్ర గ్రామీణ ప్రజా హితం కోసం మనవంతు సాయం చేయడం దానికి అనుగుణంగా అనాధ శరణాలయాలను,వృద్ధాశ్రమానికి మరియు ఎన్నో ప్రయోజన కరమైన కార్యక్రమాల ద్వారా తీసుకు రావడం.
అయితే ఇవ్వన్నీ కూడా ఉచితంగా అందేలా చూసుకోవడం అన్నింటి కంటే ముఖ్యం.ట్రస్ట్ అంటేనే స్వఛ్చందంగా విరాళాల మీద బ్రతికేది.ఏది చేసినా కూడా కేవలం విరాళాలతో మాత్రమే చేయడం సాధ్యపడుతుంది.అయితే మైత్రేయాస్ ఎవరి దగ్గర వ్యక్తిగతంగా విరాళాలు అడిగి తీసుకోలేదు తీసుకోదు.కేవలం అవసరం ఎంత ఉంది అనేది మాత్రమే తెలియపరచుతుంది.అడగనిదే అమ్మ అయినా అన్నం పెట్టదు కదా! అయితే అలా కూడా donations గురుంచి అడుగకుండా ప్రతి ప్రాజెక్ట్ పూర్తిచేయడానికి మరియు నడపడానికి సెల్ఫ్ జెనరేట్ చేసుకునేలా అమలు చేయడానికి కొన్ని ఐడియాస్ ఉన్నాయి.కానీ అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి కొంత సమయం పడుతుంది.కేవలం అప్పటివరకు మనం డొనేషన్స్ మీద ఆధారపడక తప్పదు.కనుక మనలో ఎంత చేయగలమో అంత చేద్దాం.ఒక చీమల దండు పుట్టను కట్టినట్టుగా ,వానర సేన రామ సేతు వంతెన నిర్మించిన విధంగా మనందరమూ కూడా చేయి చేయి కలిపి మోక్ష ధామం యొక్క పనులను చూసుకుందాం!! ప్రకృతి మనకి అందించిన దివ్య ప్రణాళిక లో భాగమే మొక్షధామం ఇందులో మనందరమూ భాగమవుదాము!!
చింత చచ్చినా పులుపు చావదు అని, మనం ప్రాణం వీడినా కూడా మన ఆశయం ఆవిరైపోకూడదు.చివరి వరకూ కూడా మైత్రేయాస్ తన ఆశయాల కోసం పని చేస్తూనే ఉంటుంది.
-Maha Maitreyanandi
Sri Maitreya Nirvishaya yoga Moksha dhamam
#JaiMaitreyas
#JaiNirvishayaYogam
#JaisamasthaJagat
మహా మైత్రేయానంది గారు, ఒక స్పిరిచ్యువల్ లీడర్, మైత్రేయాస్ ఇంటర్నేషనల్ స్పిరిట్యువల్ ట్రస్ట్ అధినేత్రి, 
 మైత్రేయాస్ లో ఆధ్యాత్మికతను ఎంత సులభంగా తెలుసుకోవచ్చునో, అలాంటి సరియైన జ్ఞానాన్ని అందించడం జరుగుతుంది. మైత్రేయాస్ లో అన్నీ క్లాసెస్ ఉచితంగా చెప్తారు. కావున ఇది చదువుతున్న ప్రతి ఒక్కరు తెలుసుకోవచ్చును. 
SUBSCRIBE TO OUR YOUTUBE CHANNEL

Like and share this blog

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version