అవతలి వారు ఏమి చెబుతున్నారో వినాలి!!
అవతలి వారు ఏమి చెబుతున్నారో ముందు వినాలి!! ముందు వినడం నేర్చుకోవాలి ఆ తర్వాత అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి.అర్థాన్ని అర్థం చేసుకోవాలంటే కేవలం భాష ఒక్కటే వస్తే సరిపోదు దానిలో ఉన్న అంతరార్థాన్ని గ్రహించగలగాలి.
ముందే ఆ మాట్లాడే వ్యక్తి పట్ల అభిప్రాయాన్ని కనుక కలిగినట్లైతే మనం అర్థాన్ని అవగతం చేసుకోవడం కష్టం.అతను చెడ్డ వాడు అని మనం అనుకుంటే అతను మంచి చెప్పినా మనకి చెడ్డగా అనిపిస్తుంది.అలాగే మంచి వాడు అని ముందే ఊహించుకుంటే అతను ఏమి చెప్పినా కూడా మనం మంచే అని అనుకుంటాము.
అందుకే నిర్గుణంగా వినాలి, నిష్పక్షపాతంగా వినాలి.శ్రద్ధగా వినాలి,పూర్తిగా వినాలి,ఆ తర్వాత అర్థం చేసుకుని మాట్లాడాలి అంతే కానీ మన జ్ఞానాన్నీ మధ్యలో తీసుకొని రాకుండడు.
వినేప్పుడు మన జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం మనకి నచ్చిన మెచ్చిన మాటలే పక్కవాడి నోటి నుండి వినాలనుకుంటాము. అలా మనం ఉన్నంత కాలం ఎదుట వ్యక్తి దగ్గర నుండి కొత్తగా ఏమి నేర్చుకోలేము.కేవలం మనకి తెలిసినది నచ్చినది మాత్రమే వినడానికి అలవాటు పడి పోతాము కనుక!
– మహా మైత్రేయానంది
మహా మైత్రేయానంది గారు, ఒక స్పిరిచ్యువల్ లీడర్, మైత్రేయాస్ ఇంటర్నేషనల్ స్పిరిట్యువల్ ట్రస్ట్ అధినేత్రి,
మైత్రేయాస్ లో ఆధ్యాత్మికతను ఎంత సులభంగా తెలుసుకోవచ్చునో, అలాంటి సరియైన జ్ఞానాన్ని అందించడం జరుగుతుంది. మైత్రేయాస్ లో అన్నీ క్లాసెస్ ఉచితంగా చెప్తారు. కావున ఇది చదువుతున్న ప్రతి ఒక్కరు తెలుసుకోవచ్చును.
SUBSCRIBE TO OUR YOUTUBE CHANNEL
Like and share this blog