ప్రేమిస్తున్నారా అయితే జాగ్రత్త!!
ప్రేమ వరమా శాపమా??

అసలు ప్రేమ అంటే ఏమిటి?
మనం అనుకుంటున్నదే ప్రేమ??
మనకు నచ్చినట్టు పక్కవారు ఉండడమే ప్రేమ?
ప్రేమ ఒక మహా శక్తి,ప్రేమ బ్రతికించగలదు బలితీసుకోగలదు.ప్రేమ లేని జీవితం శూన్యం.నిజానికి ప్రాణం పోయబడేది ప్రేమ శక్తి నుండే. మరి అటువంటి ప్రేమ ఎప్పుడు ప్రమాదకరంగా మారుతుందో తెలుసా?
ఎప్పుడంటే..అది వ్యక్తి కి మాత్రమే అంకితం అయిపోయినప్పుడు..వ్యక్తిగతంగా మారినప్పుడు.అది వ్యతిరేకించబడినప్పుడు.పరిణితి చెందాల్సిన ప్రేమ పరిమితి అయినప్పుడు.

ధ్రుతరాష్ట్రుని తనయుల పట్ల ప్రేమ తన తనయులకే చేటు తెచ్చింది.అది గుడ్డి ప్రేమ,తప్పొప్పుల ధర్మాధర్మాల విచక్షణ నేర్పని ప్రేమ,ఇరుక్కుపోయిన భావనల నుండి పొంగి పోర్లిన తండ్రి ప్రేమ.ఏ ప్రేమ అయితే కొడుకుల మీద నిండి పోయిందో అదే ప్రేమ వలన కొడుకుల ప్రాణాలు పోయాయి.ప్రేమ మంచిదే కానీ మంచిని పెంచేది అయిఉండాలి.

ప్రేమ పాశం,భర్త పట్ల తనకున్న ప్రేమతో యముడునే ఎదురించారు సతి సావిత్రి. యమ- నియమాలను సైతం అతిక్రమించి భర్త ప్రాణాలు పోకుండా ఆపగలిగింది .
మంచాన పడిన నాయనమ్మ ఎన్నేళ్ళు అయినా ప్రాణాలు పోక, తుది శ్వాస విడిచలేక అవస్థపడడానికి కారణం ఏమిటంటే తన మనవడి ( ఇష్టమైన వారిమీద ఉన్న ప్రేమ) మీద ఏర్పరచుకున్న ప్రేమ పాశం ( బంధం). మనవడిని కడ సారి చూడాలి అనే కోరిక.

తనకి దక్కనందుకు నీలాంబరి తాను ప్రేమించిన నరసింహా నే అంతం చేసే పనిలో తననే తానే అంతమొదించుకుంది.. ఆ ప్రేమ వలనే.

అదే ప్రేమ వలన బొమ్మరిల్లు ప్రకాష్ రాజ్ తన పిల్లల ఎదుగుదలకు ఆటంకం అయ్యాడు.
అదే ప్రేమ వలన మనం పక్క వారి జీవితంలో దూరిపోయి సలహాలు సూచనలు ఇస్తుంటాము వారిని బాగు చేసే ప్రయత్నం చేస్తాం.
పిల్లల పట్ల మన ప్రేమ వారిని అన్నీ ఒకటే సారి, తక్షణం నేర్చేసుకోవాలి, వెంటనే ఎదిగేయాలి అనే తాపత్రయం తో వారిని అసలు తప్పులే చేయనియ్యం అన్నింటినీ వారి మీద రుద్దేస్తుంటాము.
అదే భార్య భర్తల ప్రేమ కోప,తాపలకి, ఈర్ష్యా ద్వేషాలకి దారి తీస్తుంటది.
ప్రేమ అనే మహా శక్తి కేవలం ప్రేమగానే కాక అనేక రూపాలలో అనేక సందర్భాల్లో సంచరిస్తూ ఉంటుంది అచ్చం మాహ కాళి లాగా. తాను రామకృష్ణ పరమ హంస కు అమ్మగా మారితే,మధు కైటవులకు మాత్రం రాక్షసిగా మారింది!.
అదే ప్రేమ …శక్తి కూడా అదే… కానీ సంచారం లో తేడా.
అదే ప్రేమ(మూలం) కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యాలుగా,ఈర్ష్యా, ద్వేష,అసూయలు గా కూడా ప్రయాణం చేస్తుంటుంది.
ఒకరు కలవాలన్నా విడి పోవాలన్నా ప్రేమ కారణం,ప్రేమ శాశ్వతం,ప్రేమకే జీవితం అంకితం!
అంతా ప్రేమమయం..!!
అదే రామమయం..!!
అదే మన మనోమయం..!!
ఈ జగత్తంతా ప్రేమమయం..!!
అందుకే తస్మాత్ జాగ్రత్త!!
తస్మాత్ అప్రమత్ భవ!!
- మహా మైత్రేయానంది – ఫౌండర్ ఆఫ్ మైత్రేయాస్ ఇంటర్నేషనల్ స్పిరిచ్యువల్ ట్రస్ట్

ఫ్రీ “ది అనౌన్ యు” డెమో క్లాస్ కోసం రిజిస్టర్ అవ్వండి. Man Mind and Money అనే కాన్సెప్ట్ తో, ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపిన అద్భుతమైన వర్క్ షాప్. ప్రశాంతమైన జీవితాన్ని ఏర్పరుచుకోవాలి అన్న, పుష్కలంగా సంపద కలిగి ఉండాలన్న ఆలోచన మీకుంటే ఈ వర్క్ షాప్ మీకోసమే ఉచితంగా డెమో లో పాల్గొనాలి అంటే ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి.