Sri Rama Navami
శ్రీ రామ నవమి శుభాకాంక్షలు మైత్రేయులందరికీ…
రామాయణం నుంచి మనం తెలుసుకోవలసిన కొన్ని విషయాలను తెలుసుకుందాము.
మొదట శ్రీరాముడు పుట్టుక గురించి ఆలోచించండి. పుత్ర కామేష్టి యజ్ఞం చేస్తేగాని అలాంటి మహానుభావుడికి జన్మనిచ్చే శక్తిని పొందలేము. దీని నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి?
శ్రీ రాముడి లాంటి గొప్ప వారిని కనాలి అంటే ఏంతో మంచి కర్మలు చేయాలి, యజ్ఞాలు చేయాలి.
చిన్న వయసులో గురువుదగ్గరికి వెళ్లి సర్వ విద్యలు నేర్చుకోవడం, రామబాణం రాముడి మాటకి తిరుగులేదు అనేంత గొప్పగా ఆయన నేర్చుకోవడం నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే శ్రద్ధగా నేర్చుకుంటూ తనకో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకోవడం.
గురువు ఇచ్చిన టాస్క్ తన వయస్సుతో సంబంధం లేకుండా రాక్షసులతో పోరాడటం నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మన సామర్ధ్యం పెంచే విధంగా గురువు ఇచ్చిన టాస్కులను ఏ మాత్రం కండిషన్స్ పెట్టుకోకుండా గురువుని వినడం మరియు పని చేయడం.
సీతాపరిణయం నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం, తన ఆత్మ ప్రణాళికను అనుసరించే విధంగా రాముడు చేసిన సాధనను మనం కూడా చేస్తూ ఉండాలి అని.
తన పెద్దవారి మీద ఉన్న గౌరవ మర్యాదలు, కంప్లైంట్ చేయని తత్వం తో అరణ్య వాసం చేయడం మనం అరణ్య వాసం నుండి నేర్చుకోవాలి. అలాగే తన కంటే చిన్నవారికి కూడా సరియైన గైడెన్స్ ఇవ్వడం కూడా మనం ఆయన నుండి నేర్చుకోవాలి. ప్రకృతితో జీవించడం కూడా ఆయన అరణ్య వాసం నుండి మనం నేర్చుకోవచ్చు.
సీతాపహరణం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఎంత గొప్పవాడైన కష్టాలు తప్పవని, ఎన్ని కష్టాలు వచ్చినా సప్త సముద్రాలు దాటాల్సి వచ్చినా ఖచ్చితంగా ఎదుర్కోవడం సమస్యను పరిష్కరించడం నేర్చుకోవాలి. ఎదురుగా ఉన్నది అతి భయంకరుడైన రాక్షసుడే అయినా వారి కోసం, తన శక్తి సామర్ధ్యాలతో ఎదుర్కొని పోరాడి గెలవడం నుండి ఎటువంటి పెద్ద సమస్య అయినా మనం ఎదుర్కోవచ్చు అనే విషయం ని మనం నేర్చుకోవచ్చు.
మారుతీ పరిచయం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రతి మానవుడు సమస్య ఎదురైనప్పుడు మనస్సు కోతి లాగా ప్రవర్తిస్తుంది, అలాంటి కోతి ని తన జ్ఞానం తో శిష్యునిగా చేసుకుని, మనస్సుని తనతో పాటుగా తన లక్ష్య సాధనలో వినియోగించడం.
లంకాదహనము నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే మనస్సును సరిగా వినియోగిస్తే అది ఎంతో శక్తిని కలిగి ఉంటుంది, దానిని సరిగా గైడ్ చేస్తే సమస్య ఎక్కడుందో ఆ సమస్య మొత్తాన్ని మనం కాల్చేయవచ్చు అని.
రావణుడు అంటే మనలోని క్రూర ప్రవృత్తి అని, ఆంజనేయుడు అంటే మనము ట్రెయిన్ చేసిన మనస్సని సీత అంటే మన ఆత్మ అని, రాజ్యం అంటే మన బాధ్యత అని, లక్షణుడు అంటే మన తో ఉండే దైర్యం అని సూర్పనఖ అంటే మన లోని కామం అని, రామాయణం అంటే మన జీవితం అని మనం అర్ధం చేసుకుని మన జీవితాన్ని విజయవంతంగా జీవించి మన ఆత్మ ప్రణాళిక అయిపోయాక మనం మన ఆత్మను భగవంతునిలో లయం చేయాలనీ మనం అర్ధం చేసుకోవాలని తెలుసుకోవాలి .
Written by : Swami Maitreyananda
Comment if you like the explanation below!!
Subscribe to our Youtube Channel
Like and share this blog
chala adhuthanga undi
Chala అద్భుతంగా ఉంది. అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు…