ఒక్కొక్కరు ఒక్కో రీతి లో ఉంటారు.మమ్మల్నీ అర్థం చేసుకోవడం చాలా కష్టం.మేము చేసే ప్రతి దానికి ఒక లెక్క ఉంది ఆ లెక్క అందరికీ అర్థం కాదు.మేము ఏది ఎందుకు చేస్తున్నామో అర్థం చేసుకోవాలంటే ఒకటి మేమే అయ్యి ఉండాలి.మమ్మల్నీ అర్థం చేసుకోలేక దూరం అయిన వాళ్ళు ,దూరం అయ్యాక అర్థం చేసుకున్న వారు ఎందరో.
నేను ఇంటర్ చదువుతున్న సమయంలో నా హాస్టల్ రూం మేట్ ఎందుకో కోపం వచ్చి అందరితో గొడవ పడి రూం మారిపోవడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది.
మేమంతా మొత్తం ఆరుగురు,చాలా మంచి స్నేహితులము,సంవత్సరం పైగా కలిసి ఉంటూ ఎంతో గొప్పగా బంధం ఏర్పరచుకున్నాము.రూం కి కేవలం అయిదుగురు మాత్రమే కానీ మా స్నేహం వల్ల మేమందరమూ ఆరుగురు ఉండడానికి నిశ్చయించుకుని ఉండేవారము.దాని కోసం నేను అడ్జస్ట్ అయ్యి చిన్న బెడ్ తీసుకుని షెల్ఫ్ కూడా లేకుండానే సంవత్సరం నుండి ఉండేదాన్ని.అలాంటిది తాను వెళ్ళిపోతుంది అంటే నాకే మరింత బాధ.అలాగే తను వెళ్లిపోతే నాకు ఒక పెద్ద బెడ్ మరియు సెపరేట్ షెల్ఫ్ కూడా వస్తుంది.
నిజానికి తనతో ఎవరూ గొడవ పడలేదు,తనకి తానే వెళ్లిపోవాలని అని నిర్ణయించుకుంది.చెప్తే వినే పరిస్థితిలో లేదు.తను వెళ్ళిపోవడం మాకెవ్వరికీ ఇష్టం లేదు.మా అందరికీ బాధగా ఉంది,తనేమో వెళ్లిపోవాలని సామాన్లు సర్దుకుంటూ ఉంది.
వేరే వారు అయితే ఏడుస్తూ వెళ్ళొద్దని బ్రతిమిలాడ తారు ఎంత చెప్పినా తాను వినే పరిస్థితిలో లేదు.కోపంతో ఊగిపోతూ ఒక్కొక్క వస్తువు పక్క రూం కి మార్చుకుంటుంది.నేనేం చేశాను అంటే తను ఒక వస్తువు తీస్తే నేను ఒక వస్తువు తో రెఢీ గా ఉన్నా..తను ఎక్కడ తీస్తే అక్కడ పెట్టా,నిజానికి తనని ఇంకా రెచ్చగొట్టడానికి తను బాగ్ తీయడానికి ముందే నేను బాగ్ తో రెఢీ గా తన పక్కనే వెయిట్ చేస్తూ నిలబడి ఉన్న.దానితో తన కోపం కాస్తా అహంకారంగా మారింది.
మిగతా రూం మేట్స్ వారు శృతి పెద్ద గొడవ అవుతుంది,వద్దు తను బాధ పడుతుంది, ఆగు అంటూ ఆపారు.నేను మాత్రం అలాగే చేశా దానితో ఇంకా బాధ వేసి తిట్టి వెళ్ళిపోయింది.
ఆ తర్వాతి రోజు తన రూం దగ్గరకి వెళ్లి తలుపు కొట్టా,తీసింది .మెదలకుండా వెళ్లి బెడ్ మీద కూర్చుంది.నేనూ వెళ్లి తన ముందు కూర్చున్నా,తను తల దించుకుని కూర్చుంది నేను తనని చూస్తూ ఉన్న అంతే వచ్చి గట్టిగా హత్తుకుని ఏడవడం మొదలు పెట్టింది. sorry చెప్పింది,తప్పుగా మాట్లాడని నిన్ను మీ ఇంటిలో వారిని తిట్టాను అని క్షమాపణ కోరింది.
కానీ నువ్వు ఎందుకు నన్ను ఎలా రెచ్చగొట్టావ్ అని అడిగింది,నేను ఎలాగూ వెళ్లిపోతుంటే బ్రతిమిలాడక పోగా వెళ్ళిపో అన్నట్టు ఎందుకు ప్రవర్తించావు అని అడిగింది.
అప్పుడు చెప్పా” ఎవరో మీద ఏదో కోపం వచ్చి నీ వాళ్లకు నువ్వు దూరం అవ్వడం అలవాటు చేసుకుంటే నీకంటూ ఎవరూ మిగలరు.పైగా అందరూ నీకోసమే ఎదురు చూడాలని ఎలా అనుకుంటావ్?!
ఎవరూ నికూ తోడుగా రారు,నువ్వు లేకపోయినా కూడా అందరూ బ్రతకగలరు అనేది నీకు తెలియజేద్దామనే అలా చేశా.నువ్వు వద్దు అని కాల తన్నిన అవకాశ మరొకరు వెంటనే ఉపయోగించుకోవడానికి రెఢీ ఉంటారు అని గ్రహించాలి అలా చేశాను అని చెప్పి తిరిగి తనని రూం కి తెచ్చి తన షెల్ఫ్ బెడ్ తనకి ఇచ్చేశాను.
మహా మైత్రేయానంది గారు, ఒక స్పిరిచ్యువల్ లీడర్, మైత్రేయాస్ ఇంటర్నేషనల్ స్పిరిట్యువల్ ట్రస్ట్ అధినేత్రి,
మైత్రేయాస్ లో ఆధ్యాత్మికతను ఎంత సులభంగా తెలుసుకోవచ్చునో, అలాంటి సరియైన జ్ఞానాన్ని అందించడం జరుగుతుంది. మైత్రేయాస్ లో అన్నీ క్లాసెస్ ఉచితంగా చెప్తారు. కావున ఇది చదువుతున్న ప్రతి ఒక్కరు తెలుసుకోవచ్చును.
SUBSCRIBE TO OUR YOUTUBE CHANNEL
Like and share this blog