బుద్ధుడు ఎన్నో రకలా ధ్యాన సాధనలు చేశాడు ఎందరో గురువుల దగ్గర సాధన చేశాడు అయినప్పటికీ తాను తెలుసుకోవాల్సింది తెలుసుకోలేకపోయాడు అప్పుడు తన నుండి తాను కనుగొన్నాడు దానినే బోధించాడు.
ఇప్పుడు బుద్ధుడు దానిని కనిపెట్టినట్టు కాదా?!ఉన్నదానిన్నే తాను తన నుండి కనుగొన్నాడు.ఊరికే ఎవరో చెప్పింది చేయలేదు.
అదే కనుగొన్నవాడికి ఊరికే పక్క వాడిది తీసుకొని చెప్పేవాడికి గల తేడా.
చెప్పడానికి నేర్పించడానికి గల తేడా!
అనుభవం!!
చెప్పడం అంటే తెలియజేయడం బోధించడం అంటే నేర్పించడం.
ఫలానా చోట అది దొరుకుతుంది అనే ఇన్ఫర్మేషన్ పాస్ చేయడాన్ని చెప్పడం అంటారు.
పలానా చోటికి ఎలా వెళ్ళాలో చెప్పి తీసుకెళ్లడాన్ని బోధించడం (నేర్పించడం) అంటారు.రెండిటికీ చాలా తేడా ఉంది.
తెలుసుకున్నవాడు (అది
అనుభవపూర్వకంగానే అవ్వాల్సిన అవసరం లేదు) కేవలం చెప్పుతాడు.అదే అనుభవించిన వాడు,అనుభవం లోకి తెచ్చుకున్నవాడు నేర్పిస్తాడు.
తాను తెలుసుకున్న దాన్ని,తెలుసుకున్నాను అని నేర్చుకున్నా దాన్ని నేర్చుకున్నాను అని తాను నేర్పిస్తున్న దానిని తాను నేర్పిస్తున్నానని తెలియజేయడం అది అహంకారం కాదు.
అటు వెళ్తే దొరుకుతుంది అని చెప్పడానికి అక్కడికి వెళ్తే దొరుకుతుంది అని చెప్పడానికి తేడా ఉంది.
ఒక డాన్స్ టీచర్ డాన్స్ చెబుతుందా? నేర్పిస్తుందా?
ఒక music టీచర్ music చెబుతుందా? నేర్పిస్తుందా?
ఒక గురువు చెబుతాడా? బోధిస్తాడా?
ఇది అర్థం అయితే ఎన్నో అర్థం అవుతాయి.నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అని అనకూడదు.గురువు లేదు గుండ్రాయి లేదు అంటూ గురువుని గురువు అనాలో లేదో అన్న అనుమానం లో ఉన్నవారికి గురుతత్వం ఎలా అర్థం అవుతుంది.
అనంత జ్ఞానాన్ని మీరు దీనికి వినియోగించుకుంటున్నారు అనే దానిని బట్టే అది అహంకారం గా ఆత్మ జ్ఞానం గా మారుతుంది.
Maitreyas ఒక ఆధ్యాత్మిక పాఠశాల,ఇన్ఫర్మేషన్ సెంటర్ కాదు.ఇక్కడ నిర్విషయ యోగం బోధించబడుతుంది.
ఎక్కడ ఎలా ఉన్నా ఎవరు అయినా సరే తక్షణమే కేవలం ఒకే ఒక క్షణం లో మనసుని అన్నీ విషయాల నుండి నిర్విషయం అయిపోవడాన్ని నేర్పిస్తుంది,దానిని సాధన చేయిస్తుంది.
నిర్విషయ యోగం అనేది టెక్నిక్,ట్రిక్ లేదా ప్రక్రియ కాదు .
Like and share this blog